
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన కొలుగూరి సారికకు ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో డాక్టరేట్ప్రకటించింది. ప్రొఫెసర్ ఎ.సూర్యనారాయణ గైడెన్స్లో ‘ఎ స్టడీ ఆన్ ఎఫెక్టివ్నెస్ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇన్ రంగారెడ్డి అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్(విత్స్పెషల్రిఫరెన్స్టు అంగన్వాడీ)’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి థీసిస్ సమర్పించారు. పరిశీలించిన ఓయూ అధికారులు సారికకు పీహెచ్డీ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.
2014లో ఏపీ సెట్ అర్హత సాధించిన సారిక.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పలు పరిశోధనా పత్రాలను ప్రజెంట్ చేశారు. సారిక ప్రస్తుతం ప్రముఖ లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్టెక్నాలజీ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.