ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో పోలీస్పోస్టులను 20 వేలకు పెంచి, నోటిఫికేషన్రిలీజ్ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. కమిటీ చైర్మన్మోతిలాల్నాయక్ఆధ్వర్యంలో మంగళవారం ఓయూలో నిరుద్యోగులు ర్యాలీ తీశారు. కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ఇస్తే ఊరుకునేది లేదన్నారు. ఉద్యోగాలకు ఉన్న కండీషన్స్ సవరించాలని, ఎస్సై పోస్టుకు వయోపరిమితిని 38 ఏండ్లకు పెంచాలని, జీవో 46ను రద్దు చేసి, అప్లికేషన్ ఫీజు రూ.100కు తగ్గించాలని కోరారు.
