
స్టూడెంట్లు ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి
ఓయూ వైస్ చాన్స్‌లర్ రవీందర్ యాదవ్
ఓయూ, వెలుగు : స్టూడెంట్లలో స్కిల్స్ కొరత తీవ్రంగా ఉందని, కేవలం 2శాతం మందిలో మాత్రమే జాబ్‌కు కావాల్సిన స్కిల్స్ ఉంటున్నాయని ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ దిశగా స్టూడెంట్లు కష్టపడాలన్నారు. ఓయూ టెక్నాలజీ కాలేజీలో ‘లీన్ మానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఫర్ టెక్స్టైల్ అండ్ అప్పారెల్ ఇండస్ట్రీస్’ ట్రైనింగ్ప్రోగ్రామ్ను సోమవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. జాబ్ కోసం వేచి చూసే స్థాయి నుంచి జాబ్ ఇచ్చే స్థాయికి స్టూడెంట్లు ఎదగాలన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా సాయిలు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ జె.హయవదన, రమేశ్‌కుమార్, ప్రభాకరెడ్డి, ఎంఎస్ఎం డైరెక్టర్డాక్టర్ గ్లోరీ స్వరూప తదితరులు పాల్గొన్నారు.