దేశంలో కరోనా మరణాలు నాలుగు లక్షలు దాటాయి. నిన్న దేశవ్యాప్తంగా 853 మంది చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4 లక్షల 312కు పెరిగింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 46 వేల 617 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే 4.4 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 4 లక్షల 58 వేల 251కి పెరిగింది. ఇక ఇప్పటివరకూ 2 కోట్ల 95 లక్షల 48 వేల 302 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5 లక్షల 9 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇక రికవరీ రేటు 97.01 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.31 శాతానికి తగ్గింది.
