కోవిడ్ రూల్స్ పాటించని 59 లక్షల వాహనాలకు చలాన్లు

కోవిడ్ రూల్స్ పాటించని 59 లక్షల వాహనాలకు చలాన్లు

లాక్డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా రోడ్డెక్కిన 59 లక్షలకు పైగా వాహనాలకు చలానాలు విధించినట్లు ఉత్తరప్రదేశ్ డీఐజీ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. వీరందరికి చలాన్లు పంపించామని.. చలాన్లు కట్టని వాహనదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

‘కోవిడ్-19 సంబంధిత ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 59.17 లక్షలకు పైగా వాహనాలకు చలాన్లు జారీ చేయబడ్డాయి. అంతేకాకుండా 81 వేల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు’ అని లా అండ్ ఆర్డర్ డీఐజీ ధర్మేంద్ర సింగ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,354 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 1,852 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. కరోనా బారినపడి గత 24 గంటల్లో 20 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,382 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. మొత్తం డిశ్చార్జ్ కేసులు 5,41,579గా ఉన్నాయి. కాగా.. కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 8,103గా ఉంది.

దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసులలో కేవలం అయిదు రాష్ట్రాలలో మాత్రమే 56 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గర్, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రలలో 56 శాతం కేసులు నమోదవుతున్నాయి.

For More News..

9 మందిని చంపి.. శరీరాన్ని ముక్కలు చేసి కూలర్‌లో నింపిన ట్విట్టర్ కిల్లర్‌కు ఉరిశిక్ష

వీడియో: క్యాచ్ మిస్ చేశాడని స్టేడియంలోనే కొట్టినంత పనిచేసిన కెప్టెన్

58 నిమిషాల్లో 46 వంటకాలు చేసిన చిన్నారి