V6 News

GHMC వార్డు డీలిమెటేషన్: మూడ్రోజుల్లో 673కు పైగా అభ్యంతరాలు

GHMC వార్డు డీలిమెటేషన్: మూడ్రోజుల్లో 673కు పైగా అభ్యంతరాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: వార్డు డీలిమెటేషన్​కు సంబంధించి మూడో రోజు అభ్యంతరాలను జీహెచ్ఎంసీ అధికారులు స్వీకరించారు. మొత్తం 57 సర్కిల్ ఆఫీసులు, 6 జోనల్ ఆఫీసులతో పాటు హెడ్ ఆఫీసులో స్వీకరించారు. హెడ్ ఆఫీసులో శుక్రవారం 373 అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం అన్నిచోట్ల కలిపి దాదాపు 673వరకు వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

 ప్రధానంగా వార్డుల బౌండరీలకు సంబంధించి ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. వార్డుల విభజన చేసే ముందు సంబంధిత వార్డుల మ్యాప్ లని ఇవ్వాలని కోరుతున్నారు.  నేడు(రెండో శనివారం), రేపు(ఆదివారం)సెలవు దినాల్లో కూడా అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.