మూడీస్ ఆరోపణలు నిరాధారమైనవి.. ఆధార్ భద్రతపై కేంద్రం ఫైర్

మూడీస్ ఆరోపణలు నిరాధారమైనవి.. ఆధార్ భద్రతపై కేంద్రం ఫైర్

ఆధార్ భద్రత, గోప్యత ప్రమాణాలపై గ్లోబల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ చేసిన ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. మూడీస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి తెలిపింది.  ఇండియాలో కీలక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగిస్తున్న ఆధార్ భద్రతపై గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ అంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది. సెంట్రలైజ్డ్ ఐడెటిఫికేషన్ సిస్టమ్‌లో పలు లోపాలున్నాయని, చాలా సార్లు సర్వీస్‌ను అందించలేక ఆగిపోతుందని ఆరోపించింది. అధిక ఉష్ణోగ్రత, చెమటలు ఎక్కువగా పట్టే దేశంలో బయోమెట్రిక్ టెక్నాలజీని నమ్ముకోవడం తప్పని చెబుతూ పలు విషయాలను లేవనెత్తింది. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది.

Also Read : శరవేగంగా రామ్‌ టెంపుల్‌ పనులు.. జనవరిలో గ్రాండ్‌ గా ప్రారంభోత్సవం

ఆధార్ అనేది భారతదేశంలో అంతర్గత వ్యవస్థ అని.. ఆధార్ అనేది “ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ID” అని, ప్రాధమిక లేదా ద్వితీయ డేటా లేదా పరిశోధన అని తెలపకుండా నివేదికను తయారు చేసి ఆరోపణలు చేశారంటూ కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఆధార్ అనేది.. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ID – మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అభిప్రాయాలు నిరాధారమైనవి. ఒక నిర్దిష్ట పెట్టుబడిదారుల సేవ, ఎటువంటి ఆధారాలు లేదా ఆధారం లేకుండా, ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ డిజిటల్ ఐడి అయిన ఆధార్‌కు వ్యతిరేకంగా విస్తృతమైన వాదనలు చేసింది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. “గత దశాబ్దంలో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది భారతీయులు ఆధార్‌పై తమ విశ్వాసాన్ని ఉంచారు.. 100 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు తమను తాము ప్రామాణీకరించుకోవడం ద్వారా దాన్ని ఉపయోగించారు. గుర్తింపు వ్యవస్థలో ఇంత అపూర్వమైన విశ్వాస ఓటును విస్మరించడం అంటే వినియోగదారులు వారి స్వంత ప్రయోజనాలను అర్థం చేసుకోలేరని అర్థం. వారి స్వంత ప్రయోజనం కోసం అభియోగాలు మోపారు” అని ఆరోపించింది.

ఐఎంఎఫ్(IMF), ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ సంస్థలు ఆధార్‌ను ప్రశంసించాయని, ఇలాంటి డిజిటల్ ID వ్యవస్థలను ఎలా అమలు చేయాలో అర్థం చేసుకోవడానికి అనేక దేశాలు UIDAIని సంప్రదించాయని కేంద్రం తెలిపింది.