V6 News

ఈ వారంలో సీర‌మ్ ఇండియా మూడో దశ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ..ప్ర‌క‌టించిన కేంద్రం

ఈ వారంలో సీర‌మ్ ఇండియా మూడో దశ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ..ప్ర‌క‌టించిన కేంద్రం

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్.ఈ వ్యాక్సిన్ మూడవ దశ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ఈ వారంలో ప్రారంభం కానున్న‌ట్లు నీతిఆయోగ్ ప్ర‌తినిధి వీకేపాల్ వెల్ల‌డించారు.

20 కేంద్రాల్లో మూడో ద‌శ ట్ర‌య‌ల్స్

ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ ను మ‌న‌దేశంలోని 20కేంద్రాల్లో హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వాటిల్లో పూణే, మహారాష్ట్ర, ముంబై , గుజరాత్ లోని అహ్మదాబాద్ లు ఉన్నాయి. ఈ మూడో ద‌శ‌లో 1,600 మందికి వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. క‌రోనా ఐదు హాట్ స్పాట్స్ ప్రాంతాల్ని క‌లుపుకొని మొత్తం దేశ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆస్ప‌త్రుల‌లో ఈ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ట్లు సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ప్ర‌తినిధి తెలిపారు. ఐసిఎంఆర్ భాగస్వామ్యంతో 11-12 ఆస్పత్రులలో ట్రయల్స్ నిర్వహించడానికి ప్ర‌య‌త్నిస్తున్నట్లు చెప్పారు