ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది

ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలును నడిపిన మహిళా సిబ్బంది

ఇప్పటికే మహిళలు రైల్వే కో ఫైలట్‌గా సత్తా చాటుతున్నారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణ వాయువును చేరవేస్తున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు నడిపి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. అయితే, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే ఆ రైళ్లు వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను అయా రాష్ట్రాలకు చేరవేశాయి. లేటెస్టుగా జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి  ఆరు బోగీల ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఒకటి బెంగుళూరులోని వైట్‌ ఫీల్డ్ కు చేరుకుంది.

అయితే.. ఆ రైలులో మొత్తం మహిళా సిబ్బందే ఉన్నారు. రైలు డ్రైవర్‌, అసిస్టెంట్ డ్రైవర్‌, గార్డ్ వరకూ అంతా మహిళ ఉద్యోగులే. వైట్‌ఫీల్డ్ కు చేరుకున్న ఆ రైలు మొత్తం 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ జార్ఖండ్ నుంచి కర్ణాటకకు తీసుకువచ్చారు. దీనికి సంబందించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.