
- రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని మెడికల్ కాలేజీ సమస్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్టీఏ మెంబర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పడాల రాహుల్ అన్నారు. మెడికల్ కాలేజీని గురువారం ఆయన సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ ఎస్ హయాంలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు అయినప్పటికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు.
విద్యార్థులకు ఒకే బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అదనంగా మరొక బస్సు ఏర్పాటు చేయాలని, కాలేజీ దగ్గరలో రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులకు అందజేసే భోజనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో భోజనం అందించాలని ఫోన్‌లో కాంట్రాక్టర్‌కు సూచించారు. రాహుల్ వెంట యూత్ కాంగ్రెస్ నేతలు మడుగుల ప్రవీణ్, ఆకుల ఉదయ్, వాసు, శ్రవణ్ రెడ్డి, అర్జున్ గౌతం రెడ్డి, సుఫియన్ తదితరులు ఉన్నారు.