
బోధన్,వెలుగు: మండలంలోని కల్దుర్కిలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి తక్కువ ధరకు వడ్లు విక్రయించి మోసపోవద్దన్నారు. తడి వడ్లు తీసుకురాకుండా ఎండబెట్టి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నా రు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాల్రూ.2389, ‘బీ’ గ్రేడ్ధాన్యం క్వింటాల్ రూ.2369 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నారు. కొనుగోలు సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. టార్ఫాలిన్లతోపాటు రైతుల కోసం టెంట్లు, తాగునీటి వసతి కల్పించామన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీఏ ఎండీ అలీం, సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్ చారి, కల్దుర్కి ఏఈవో అనుజసాయిచరణ్, సిద్దాపూర్ ఏఈవో మహమ్మద్ ముజమ్మాయిల్, రైతులు ప్రకాశ్పటేల్, మాధవ్ రావు, గణపతిరెడ్డి, నరేందర్ రెడ్డి, మారుతిరావు, మారయ్య పాల్గొన్నారు.