రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్లో పద్మఅవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. సినీ నటుడు చిరంజీని పద్మభూషణ్ తో సత్కరించారు.  

అలాగే సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌ (మరణానంతరం) తరఫున ఆయన కుటుంబసభ్యులకు పద్మవిభూషణ్‌ అవార్డును అందజేశారు.  సినీనటుడు మిథున్‌ చక్రవర్తి, మాజీ గవర్నర్‌ రామ్‌నాయక్‌, ప్రముఖ గాయని ఉషా ఉథుప్‌ పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

 ఈ కార్యక్రమంలో  ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.  అవార్డు గ్రహీతలలో దాదాపు సగం మందికి ఈ రోజు అవార్డులు ప్రదానం చేయగా, మిగిలిన వారికి వచ్చే వారం అవార్డులు ప్రదానం చేయనున్నారు.  

ఈ ఏడాది జనవరి 25న దేశంలోని 132 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఐదు మందికి పద్మవిభూషణ్, 17 మదికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.  దేశంలోని అత్యున్నత పౌర పురస్కారలలో ఒకటైన పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేయబడతాయి -- పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు .