కాబోయే సీఎం కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడు

కాబోయే సీఎం కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడు

కాబోయే సీఎం కేటీఆరే అంటూ మంత్రులు ఒక్కొక్కరుగా వాయిస్ వినిపిస్తున్నారు. సీనియర్ మంత్రి ఈటలతో పాటు.. చాలా మంది మంత్రులు.. బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కేసీఆర్ కు తగ్గ తనయుడు అని అంటున్నారు. నిన్న కొంత మంది మంత్రులు మాట్లాడితే… ఇవాళ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్  ఓ అడుగు ముందుకేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలోనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ముందస్తు శుభాకాంక్షలు చెప్పారు. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ సమక్షంలోనే పద్మారావుగౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా… ముఖ్యమంత్రి అయ్యాక రైల్వే కార్మికులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు.

సీఎం మార్పు విషయంలో కేసీఆర్..ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కేటీఆర్ కు సీఎం అయ్యే అర్హత ఉందని..ఆయన తండ్రికి తగిన తనయుడని చెప్పారు. సీఎం మార్పుపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని..అది మా పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు గంగుల.