తిండేమో రోజుకు 8 కిలోలు తింటారు: పాక్ ఆటగాళ్లను బండబూతులు తిడుతున్న మాజీలు

తిండేమో రోజుకు 8 కిలోలు తింటారు: పాక్ ఆటగాళ్లను బండబూతులు తిడుతున్న మాజీలు

ప్రయోజకులు కావాల్సిన కొడుకులు దారి తప్పి తిరుగుతుంటే తల్లిదండ్రులు ఎలా తిడతారో గుర్తుందా! మా వాడు పనికిరాడబ్బా అని ఓ తండ్రి అంటే, మా వాడు మీవాడి కంటే పెద్ద పోరంబోకు అని మరోకరి తండ్రి అంటుంటారు. ఇక మూడో తండ్రి గురుంచి చెప్పక్కర్లేదు. ఆ మాటలు మీ ఊహకే వదిలేస్తున్నా. ఆఫ్గనిస్తాన్‌తో ఓటమి తరువాత ఆ దేశ మాజీ ఆటగాళ్లు.. పాక్ క్రికెటర్లను అచ్చం ఇలానే తిడుతున్నారు. మా వాళ్లు సందర్శన కోసమే భారత్‌కు వెళ్లారని ఒకరంటే.. రోజుకు 8 కిలోల తిండి తింటారని మరొకరు తిడుతున్నారు. 

ఆటలో గెలుపోటములు సహజం కావచ్చేమో కానీ, చిన్న జట్టుగా పరిగణించే ఆఫ్గన్ చేతిలో ఓటమిని మాత్రం ఆ దేశ మాజీలు  జీర్ణించుకోలేకపోతూన్నారు. ఉదయాన్నే టీవీ డిబేట్లకు హాజర్లైన పలువురు క్రికెటర్లు, మాజీలు ప్రస్తుత వరల్డ్ కప్ జట్టుపై విమర్శలు గుప్పించారు. వీరిలో సానియా మీర్జా భర్త షోయాబ్ మాలిక్‌తో పాటు, బాసిత్ అలీ, బాజిద్ ఖాన్, వసీం అక్రమ్, మహ్మద్ హఫీజ్, అజహర్ అలీ, షోయాబ్ అక్తర్ పలువురు ఉన్నారు. 

వసీం అక్రమ్: మా ఆటగాళ్ల ఫిట్‌నెస్ చూడండి.. వారి ముఖాలను చూస్తే, ప్రతిరోజూ 8 కిలోల కరాహి-నిహారీ(ఒకరకమైన మాంసాహారం)ని తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. జట్టులో రెండేళ్లుగా ఫిట్‌నెస్ పరీక్షలు లేవు. ఈ  టోర్నీలో తక్కువ ఫిట్‌నెస్ స్థాయితో ఆడుతున్న పెద్ద ముఖాలు అంటే మనవాళ్లే .." అని వసీం అక్రమ్ తెలిపాడు. 

మహ్మద్ హఫీజ్: పాకిస్థాన్ జట్టు ప్రదర్శనను చూసి ఒక క్రికెట్ అభిమానిగా ఈరోజు నేను చాలా బాధపడ్డాను.. కనీసం తదుపరి మ్యాచ్‌లలో పాకిస్థాన్ మెరుగవ్వాలి. ఎందుకంటే ఒక గొప్ప జట్టునుఇలా చూడటం చాలా బాధాకరం.." అని హఫీజ్ ఓటమిపై తన బాధను వెళ్లగక్కాడు. 

బాసిత్ అలీ: విరాట్‌ కోహ్లి మాదిరిగా బాబర్‌ అజామ్‌ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలి. అదే అతని కెరీర్‌కు మంచింది. రెగ్యులర్‌ బ్యాటర్‌గా జట్టులో ఉంటే చాలు.. అతను ఎంత మంచి బ్యాటర్ అయినా కావొచ్చు.. ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సింద.." అని బాసిత్ అలీవిమర్శించాడు.

ALSO READ :- Good Health : పిప్పలితో షుగర్, లంగ్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టొచ్చు