భారత్​తో యుద్ధం వస్తే ఇంగ్లాండ్​కు పారిపోతా: పాక్​ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్​తో యుద్ధం వస్తే ఇంగ్లాండ్​కు పారిపోతా: పాక్​ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌‌: పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్‌‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) నేత, జాతీయ అసెంబ్లీ సభ్యుడు షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారత్‌‌తో యుద్ధం జరిగితే తుపాకీ పట్టుకుని సరిహద్దుకు వెళ్తారా? అని అడుగగా.. ‘యుద్ధం వస్తే నేను ఇంగ్లాండ్‌‌కు వెళ్తా’ అని మార్వాత్ తెలిపారు. 

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత ప్రధాని మోదీ వెనక్కి తగ్గాలని మీరు భావిస్తున్నారా? అన్న  ప్రశ్నకు మార్వాత్ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ‘నేను చెప్పగానే వెనక్కి తగ్గడానికి మోదీ నా అత్త కొడుకా?’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్‌‌ సోషల్‌‌ మీడియాలో వైరలైంది.