పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనీయులు పీస్ పీస్ అయ్యారు

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనీయులు పీస్ పీస్ అయ్యారు

పాకిస్తాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో  ఐదుగురు చైనీయులు పీస్ పీస్ అయ్యారు.  2024 మార్చి 26వ తేదీ మంగళవారం రోజున పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వాలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇస్లామాబాద్‌ నుంచి ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని దాసులోని తమ శిబిరానికి వెళుతున్న చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబర్  దాడి చేశారు.  ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈ దాడిలో ఐదుగురు చైనా జాతీయులు మరియు వారి పాకిస్థానీ డ్రైవర్ మరణించారని పోలీసు చీఫ్ మహ్మద్ అలీ గండాపూర్‌  తెలిపారు.   ఖైబర్ పఖ్తుంక్వా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాన్వాయ్‌లోని మిగిలిన వారికి రక్షణ కల్పించామని తెలిపారు. దాసు ఒక ప్రధాన ఆనకట్ట ఉన్న ప్రదేశం..  ఈ ప్రాంతంలో గతంలో దాడి కూడా జరిగింది.  2021లో బస్సులో జరిగిన పేలుడులో తొమ్మిది మంది చైనా పౌరులు సహా 13 మంది చనిపోయారు. 

ఆ సమయంలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు పాకిస్తాన్ లక్షలాది పరిహారం చెల్లించింది . దాడిపై విచారణకు చైనా తన బృందాన్ని పంపింది. అలాగే 2023 ఆగస్టులో, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై సాయుధ తిరుగుబాటుదారులు దాడి చేశారు, దీని ఫలితంగా తిరుగుబాటుదారులు, పాకిస్తాన్ భద్రతా దళాల మధ్య తీవ్రమైన కాల్పులు జరిగాయి.