Asia Cup 2025 final: ఫైనల్‌కు ముందు కాన్ఫిడెంట్ దెబ్బ తీయడానికేనా.. అర్షదీప్ సింగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు

Asia Cup 2025 final: ఫైనల్‌కు ముందు కాన్ఫిడెంట్ దెబ్బ తీయడానికేనా.. అర్షదీప్ సింగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు

ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 28) ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫైనల్ కు కొన్ని గంటల ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే ఇప్పడు అర్షదీప్ ను పాక్ క్రికెట్ బోర్డు టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాశంసంగా మారింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21ని అమలులోకి తీసుకుని వచ్చి అర్షదీప్ సింగ్ కు ఐసీసీ చేత వార్నింగ్ లేదా ఫైన్ విధించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తున్నటు సమాచారం.

రిపోర్ట్స్ ప్రకారం.. ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం(సెప్టెంబర్ 21) దుబాయ్‌లో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ప్రేక్షకుల వైపు చూస్తూ "అసభ్యకరమైన" సంజ్ఞలు చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో లేని అర్షదీప్   టీమిండియా విజయం సాధించిన తర్వాత అసభ్యకరమైన సైగలు చేసినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావించింది. మ్యాచ్ తర్వాత అర్ష్‌దీప్ బౌండరీ దగ్గర వ్యంగ్యంగా తన సంజ్ఞలతో 'ఆటకు అపఖ్యాతి తెచ్చాడు' అని పీసీబీ ఆరోపించింది. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్‌కు ప్రతీకారంగా అర్షదీప్ సింగ్ ఈ సైగను చేసినట్టుగా వారు భావిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?
 
ఇండియా- పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ వద్ద రవూఫ్‌ను ఇండియన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 2022 టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ.. రౌఫ్ బౌలింగ్ లో బాదిన రెండు సిక్సర్లను గుర్తు చేశారు. దీనికి ప్రతి స్పందనగా రౌఫ్ ఓవరాక్షన్ చేశాడు. తమ దేశం ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో 6 యుద్ధ విమానాలను కూల్చేశామని సైగలు చేస్తూ కనిపించాడు. 

రౌఫ్ ఓవరాక్షన్‌కు మ్యాచ్ తర్వాత అర్షదీప్ సింగ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్.. ‘నీ సైగలను మడిచి అక్కడ పెట్టుకో’ అంటూ తన చేతులతో సైగ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇచ్చి పడేశావ్ అంటూ అర్ష్‌దీప్ సింగ్‌కు మద్దతులగా భారత అభిమానులు కామెంట్స్ చేశారు. ఇక పాకిస్తాన్ ఫ్యాన్స్ వారి ప్లేయర్ల మాదిరే ఏడుపు మొదలు పెట్టారు.