భారత్‌‌తో వ్యాపార బంధంపై పాక్ యూటర్న్

భారత్‌‌తో వ్యాపార బంధంపై పాక్ యూటర్న్

ఇస్లామాబాద్: దాయాది పాకిస్థాన్ తన కుటిల బుద్ధిని మరోమారు చూయించింది. భారత్ తో స్నేహ బంధానికి తాము రెడీ అని చెప్పిన పాక్.. అవి ఉత్తుత్తి మాటలేనని నిరూపించింది. ఇండియా నుంచి వచ్చే పత్తి, చక్కెర  మీద పొరుగు దేశం నిషేధం విధించిందని తెలుస్తోంది. ఈ మేరకు భారత్ ఎగుమతులను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంత్రి వర్గం బ్యాన్ చేసిందని పాక్ మీడియా సమాచారం. ఈ విషయం పై ఆ దేశ సర్కారు నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. జమ్మూ కశ్మీర్‌‌ కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసినప్పటి నుంచి భారత్ నుంచి వచ్చే దిగుమతుల మీద పాక్ నిషేధం విధించింది.