
అహ్మదాబాద్ : పాక్ ప్రయత్నాన్ని తిప్పి కొట్టింది భారత్. పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ ను భారత సైన్యం పేల్చేసింది. ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో గుజరాత్ లోని కుచ్ బోర్డర్ వద్ద డ్రోన్ ను పేల్చేశారు. నిఘా కోసం ఈ డ్రోన్ ను పాకిస్థాన్ ఉపయోగించింది. నలియా ఎయిర్ బేస్ క్యాంపు సమీపంలో డ్రోన్ ను పసిగట్టిన భారత సైన్యం అప్రమత్తమై దాన్ని పేల్చేసింది. ఈ నలియా ఎయిర్ బేస్ క్యాంపు అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గర్లో ఉంది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్‌లో జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులతో భీకరదాడి జరిపి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. జైషే మహమ్మద్‌కు చెందిన ఆల్ఫా -3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటలకు 12 మిరేజ్-2000 జెట్ ఫైటర్స్‌తో దాడి చేశారు. CRPF జవాన్లపై దాడి జరిగిన 12 రోజుల తర్వాత దాడులు జరిగాయి.
#Pakistan drone shot down at #IAF station in Naliya, Gujarat @IAF_MCC @OfficialDGISPR #surgicalstrike2 pic.twitter.com/XvbgPE7HXw pic.twitter.com/VXk0kzOXed
— mahesh buddi (@maheshbuddiTOI) February 26, 2019