టీ20 వరల్డ్ కప్‌‌‌‌ను విజయంతో ముగించిన పాకిస్తాన్

టీ20 వరల్డ్ కప్‌‌‌‌ను  విజయంతో ముగించిన పాకిస్తాన్

లాడర్‌‌‌‌‌‌‌‌హిల్స్‌ ‌‌‌:  సూపర్‌‌‌‌‌‌‌‌–8 రౌండ్‌‌‌‌ చేరలేకపోయిన పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌ను  విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ చివరి మ్యాచ్‌‌‌‌లో 3 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌‌‌‌ను ఓడించి ఊరట దక్కించుకుంది. టాస్ నెగ్గిన ఐర్లాండ్ తొలుత 20 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. గారెత్ డెలానీ (31), జోష్ లిటిల్ (22 నాటౌట్‌‌‌‌) రాణించారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం, షాహీన్ షా చెరో మూడు, మహ్మద్ ఆమిర్‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 111/7 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (32 నాటౌట్‌‌‌‌)సత్తా చాటాడు. ఓపెనర్లు రిజ్వాన్ (17), సైమ్ ఆయుబ్‌‌‌‌ (17) ఫర్వాలేదనిపించడంతో పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో 40/2తో నిలిచిన పాక్ తర్వాత ఒక్కసారిగా తడబడింది.  జోష్ లిటిల్ (3/15), క్యాంఫర్ (2/24) దెబ్బకు ఫకర్ జమాన్ (5), ఉస్మాన్ ఖాన్ (2) షాదాబ్ ఖాన్ (0), ఇమాద్ వసీం (4) పెవిలియన్‌‌‌‌ చేరారు.

దాంతో పాక్ 62/6తో ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో బాబర్, అబ్బాస్ ఆఫ్రిది (17 ) జాగ్రత్తగా ఆడి జట్టును ముందుకు తీసుకెళ్లారు. మరో 12 రన్స్​ అవరమైన దశలో అబ్బాస్ ఔటైనా షాహీన్ షా (13 నాటౌట్‌‌‌‌)తో  రెండు సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు.   షాహీన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.