
IAF పైలట్ అభినందన్ ను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. రేపు రిలీజ్ చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఇవాళ పాక్ పార్లమెంట్ లో ఆయన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ తో తాము శాంతిని కోరుకుంటున్నామన్న ఇమ్రాన్…చర్చలకు మొదటి మెట్టుగా పైలట్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు మేం చేస్తున్న పనిని చేతకాని తనంగా చూడోద్దన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఐదు నిమిషాల పుల్వామా ఘటన గురించి భారత్ మాట్లాడుతోంది… కానీ 19 ఏళ్ల కశ్మీరీ యువకుడు మానవ బాంబుగా ఎందుకు మారాడో ఆలోచించడంలేదన్నారు.