టీకా తీసుకున్న రెండ్రోజులకే పాక్ ప్రధాని ఇమ్రాన్ కు కరోనా..

టీకా తీసుకున్న రెండ్రోజులకే పాక్ ప్రధాని ఇమ్రాన్ కు కరోనా..

ఇప్పటికే పలు దేశాలు అధ్యక్షులు, ప్రధానులు కరోనా బారిన పడ్డారు. లేటెస్టుగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ కు కరోనా సోకింది. ఆయన వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఆయనకు ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారని పాక్ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ శనివారం ప్రకటించారు. 

రెండు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నఇమ్రాన్ ఖాన్.. ఆ తర్వాత లక్షణాలు కనిపించడంతో.. టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్టు పాక్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు.  పాక్‌లో ఇప్పటివరకు 6,15,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మార్చి 10న ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. ఫిబ్రవరి మొదట్లో ఆరోగ్య కార్యకర్తలు, కరోనా వారియర్స్‌కు టీకా వేయగా ఇప్పుడు.. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రధానికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.