
- ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. ఇరు దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించేందుకు కొత్త ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ట్రంప్‌తో షెహబాజ్ భేటీ కానున్నారు.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్ జీఏ) సమావేశంలో పాల్గొనేందుకు షెహబాజ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. అక్కడి నుంచి వాషింగ్టన్కు ప్రయాణించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. గురువారం న్యూయార్క్ కు తిరిగొచ్చి తన యూఎన్‌జీఏ కార్యక్రమాలను కొనసాగిస్తారు. దౌత్యవర్గాలను ఉటంకిస్తూ ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ న్యూస్ పేపర్ బుధవారం ఈ విషయాలను వెల్లడించింది.