సరిహద్దులో కాల్పుల తీవ్రత పెంచుతోన్న పాక్ .. ఆర్టిలరీ , మోర్టార్ గన్స్తో దాడులు

సరిహద్దులో కాల్పుల తీవ్రత పెంచుతోన్న పాక్ .. ఆర్టిలరీ , మోర్టార్ గన్స్తో  దాడులు

పీవోకేలో ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో కాల్పుల తీవ్రత పెంచుతోంది పాకిస్థాన్. మే 7 వరకు   చిన్న  ఆయుధాలతోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంగించిన పాక్ ..మే 8న  ఆయుధాలు మార్చి కాల్పులు జరుపుతోంది. చిన్న ఆయుధాల నుంచి.. ఆర్టిలరీ గన్స్ తో పాక్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు.  ఆపరేషన్ సిందూర్  తర్వాత  మోర్టార్ గన్స్, శతజ్ఞులతో దాడులకు దిగుతోంది పాక్. మే 7 న రాత్రి చిన్న  ఆయుధాలతో పాటు.. ఆర్టిలరీ గన్స్ వాడకాన్ని పెంచింది పాక్.

మే 7న రాత్రి  ప్రధానంగా  పూంచ్‌‌ జిల్లాలోని బాలాకోట్, మెంధర్, మన్‌‌కోట్, కృష్ణ ఘాటి, గుల్పూర్, కెర్ని, పూంచ్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు దాడులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌‌లో, రాజౌరి జిల్లాలో, కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెక్టార్‌‌లోని పలు ప్రాంతాల్లో పాక్ ఆర్మీ అటాక్ చేసింది. ఈ దాడుల్లో 13  మంది భారత పౌరులు చనిపోవడంతోపాటు డజన్ల కొద్దీ ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించడంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మంగళవారం అర్ధరాత్రి దాటాకా పాకిస్తాన్ ఆర్మీ ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు, ఆర్టిలరీ షెల్లింగ్‌‌కు పాల్పడినట్లు భారత రక్షణ శాఖ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. పాక్ సైన్యం దాడులకు భారత సైన్యం దీటుగా బదులిస్తున్నదని తెలిపారు. ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో  శత్రు దళాలకు భారీ నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఎల్వోసీ వెంబటి పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. పాక్ చర్యలకు భారత సైన్యం సంయమనంతో తగిన విధంగా ప్రతిస్పందిస్తోందని అధికారులు పేర్కొన్నారు.