బోర్డర్‎లో మళ్లీ మొదలుపెట్టిన పాక్.. LOC వెంబడి భారీగా కాల్పులు

బోర్డర్‎లో మళ్లీ మొదలుపెట్టిన పాక్.. LOC వెంబడి భారీగా కాల్పులు

శ్రీనగర్: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ బుద్ధి మారడం లేదు. గురువారం (మే 8) రాత్రి భారత్ దెబ్బకు కకావికలమైన పాక్ నిసిగ్గుగా మళ్లీ కాల్పులకు తెగబడింది. శుక్రవారం (మే 9) రాత్రి నియంత్రణ రేఖ (ఎల్‎వోసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది పాక్ ఆర్మీ. యూరీ సెక్టర్, కుప్వారాలో భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా భారీగా కాల్పులకు పాల్పడింది. మిషన్ గన్స్‎తో భారీగా షెల్లింగ్ చేస్తోంది. 

పాక్ కాల్పుల నేపథ్యంలో భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. పాక్ కాల్పులను ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టింది. బోర్డర్లో పాక్, భారత ఆర్మీ పరస్పర కాల్పుల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుందో అని బోర్డర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.