పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు భారత సైనికులు మృతి

పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు భారత సైనికులు మృతి

పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. జమ్మూ కశ్మీర్ లోని రాంపూర్‌లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ శుక్రవారం కాల్పులు జరిపింది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరు సైనికులు ఈ రోజు మరణించారు. మరో సైనికుడికి కూడా గాయాలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో ఈ కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. ‘మే 1,2020న, సాయంత్రం 3:30 గంటలకు బారాముల్లాలోని రాంపూర్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘనను ప్రారంభించింది’ అని కల్నల్ రాజేష్ కలియా ఒక ప్రకటనలో తెలిపారు. ఆ దాడికి భారత సైన్యం కూడా తగిన విధంగా స్పందించి ప్రతీకారం తీర్చుకుందని ఆయన అన్నారు. అంతకుముందు ఏప్రిల్ 30న కూడా పాకిస్తాన్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరిపి కాల్పుల విరమణను ఉల్లంఘించింది.

For More News..

గ్యాస్ సిలిండర్ల స్టోర్‌హౌస్‌లో పేలుడు