Asia Cup 2025: తొలి విజయం ఎవరిది: కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌దే టాస్.. శ్రీలంక బ్యాటింగ్

Asia Cup 2025: తొలి విజయం ఎవరిది: కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌దే టాస్.. శ్రీలంక బ్యాటింగ్

ఆసియా కప్ లో పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య ఆసక్తి సమరం ప్రారంభమైంది. మంగళవారం (సెప్టెంబర్ 23) అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సూపర్-4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓడిపోయింది. మరోవైపు పాకిస్థాన్ జట్టును ఇండియా చిత్తు చేసింది. సూపర్-4లో ఒక్కో జట్టు మూడు మ్యాచ్ లే ఆడుతుండడంతో ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం అవుతాయి.

శ్రీలంక (ప్లేయింగ్ XI):

పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషార

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):

సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ 

►ALSO READ | Asia Cup 2025: ఈ రోజు (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ గెలిస్తే రేపు ఇండియాకు అడ్వాంటేజ్.. ఎలాగంటే..?