Asia Cup 2025: ఈ రోజు (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ గెలిస్తే రేపు ఇండియాకు అడ్వాంటేజ్.. ఎలాగంటే..?

Asia Cup 2025: ఈ రోజు (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ గెలిస్తే రేపు ఇండియాకు అడ్వాంటేజ్.. ఎలాగంటే..?

ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా మరో నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఇప్పటికి రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. టోర్నీలో జరగబోయే మిగిలిన మ్యాచ్ లు నాలుగు జట్లకు కీలకం కానున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 23) శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో శ్రీలంకపై పాకిస్థాన్ గెలిస్తే రేపు ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రేపు బంగ్లాపై గెలిస్తే ఫైనల్ కు వెళ్లొచ్చు.. కానీ ఇలా జరగాలి:

సూపర్-4 లో భాగంగా నేడు శ్రీలంకపై పాకిస్థాన్ విజయం సాధిస్తే బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండియా ఒక్కో విజయాన్ని సాధిస్తాయి. ఇలా జరిగితే రేపు ఇండియా బంగ్లాదేశ్ మీద విజయం సాధిస్తే రెండు విజయాలతో ఎలాంటి సమీకరణలతో పని లేకుండా ఫైనల్ కు చేరుకోవచ్చు. ఈ రోజు శ్రీలంక ఓడిపోయిందనుకుందాం. అప్పుడు ఒక్కో విజయంతో ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు గురువారం (సెప్టెంబర్ 25) మ్యాచ్ ఆడతాయి. ఏ జట్టు గెలిచినా రెండు విజయాలతో ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరోవైపు రేపు (అక్టోబర్ 24) బంగ్లాదేశ్ పై ఇండియా గెలిస్తే రెండు విజయాలతో ఫైనల్ కు చేరుతుంది. 

అప్పుడు ఇండియా, శ్రీలంక మధ్య జరగబోయే చివరి మ్యాచ్ నామమాత్రంగా మారనుంది.  చివరి మ్యాచ్ లో శ్రీలంకపై ఇండియా ఓడిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు శ్రీలంకపై పాకిస్థాన్ గెలిస్తే గురువారం (అక్టోబర్ 25) పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య అనధికార సెమీ ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు రెండు విజయాలతో ఫైనల్ కు వెళ్తుంది. మరోవైపు అప్పటికే ఇండియా రెండు విజయాలతో ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. అప్పుడు చివరి మ్యాచ్ లో శ్రీలంక ఇండియా మీద గెలిచినా వారు టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు. ఒకవేళ పాకిస్థాన్ ఈ రోజు ఓడిపోతే రేపు బంగ్లాదేశ్ పై ఇండియా గెలిచినా ఫైనల్ ప్లేస్ కన్ఫర్మ్ కాదు.     

►ALSO READ | Virat Kohli: లండన్‌లోనే కోహ్లీ.. ఫోటోలు వైరల్: ఇండియాలో అడుగుపెట్టేది అప్పుడే!

టోర్నీ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ లో గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 లో తొలి మ్యాచ్ ఆడితే బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం (సెప్టెంబర్ 21)  జరిగిన మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. సోమవారం నాలుగు జట్లకు రెస్ట్ ఇవ్వడంతో ఈ రోజు ఎలాంటి మ్యాచ్ లు జరగలేదు. మంగళవారం (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ తో శ్రీలంక.. బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియా, బంగ్లాదేశ్.. గురువారం (సెప్టెంబర్ 25) బంగ్లాదేశ్ తో పాకిస్థాన్.. శుక్రవారం (సెప్టెంబర్ 26) ఇండియా, శ్రీలంక మ్యాచ్ లు ఉంటాయి.

ఆసియా కప్ 2025 - సూపర్-4 షెడ్యూల్:

సెప్టెంబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్ - దుబాయ్ - 8:00pm
 
సెప్టెంబర్ 21: భారత్ vs పాకిస్థాన్ - దుబాయ్ - రాత్రి 8:00 

సెప్టెంబర్ 23: పాకిస్థాన్ vs శ్రీలంక - అబుదాబి - రాత్రి 8:00
 
సెప్టెంబర్ 24: భారతదేశం vs బంగ్లాదేశ్ - దుబాయ్ - 8:00pm 

సెప్టెంబర్ 25: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - దుబాయ్ - రాత్రి 8:00 IST

సెప్టెంబర్ 26: భారత్ vs శ్రీలంక - దుబాయ్ - రాత్రి 8:00
 
సెప్టెంబర్ 28: ఫైనల్ -  దుబాయ్ - రాత్రి 8:00