
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ లోనే ఉన్నాడు. ఫ్యామిలీతో లండన్ లో ప్రశాంతంగా గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ తర్వాత లండన్ కు వెళ్లిన కోహ్లీ మూడు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. ఒక అభిమానుల సంఘం కోహ్లీ, అనుష్క ఫోటోలను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక అభిమానుల సంఘం షేర్ చేయడంతో వీరు ఇంకా లండన్ లోనే ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. "విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కొన్ని రోజుల క్రితం లండన్‌లో కనిపించారు". అనే క్యాప్షన్‌తో అభిమానులు షేర్ చేశారు.
ఈ ఫోటోల్లో అనుష్క ప్లం లెగ్గింగ్స్, బ్యాగీ పర్పుల్ స్వెట్‌షర్ట్, తెల్లటి స్నీకర్స్ ధరించింది. తమ కుమారుడు అకాయ్ ను స్ట్రాలర్‌లో తీసుకెళ్తూ కనిపించింది. ఆమె తెల్లటి బేస్ బాల్ క్యాప్ కూడా ధరించింది. మరోవైపు కోహ్లీ.. జీన్స్, తెల్లటి స్నీకర్లతో కూడిన బ్రౌన్ స్వెట్‌షర్ట్ లో కనిపించాడు. స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని తన తలని బ్రౌన్ బీనితో కప్పుకున్నాడు. ఈ క్రేజీ కపుల్ ను మళ్ళీ ఇండియాలో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. "కుటుంబ సమయాన్ని ఆస్వాదించండి..." అంటూ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఫిబ్రవరి 2024లో అకాయ్ పుట్టిన తర్వాత కోహ్లీ దంపతులు శాశ్వతంగా లండన్ లో స్థిరపడ్డారని వార్తలు వచ్చాయి.
ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఇండియాలో అడుగుపెట్టనున్న కోహ్లీ:
ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి క్రికెట్ ఆడలేదు. టెస్ట్, టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న విరాట్.. ఆ తర్వాత లండన్ వెళ్ళాడు. ఇప్పటివరకు ఇండియా తిరిగి రాలేదు. తన ఫ్యామిలీతోనే లండన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ జూలైలో జరిగిన వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆగస్టు 8న లండన్‌లో షాష్ పటేల్ అనే వ్యక్తితో పూర్తిగా తెల్ల గడ్డంతో ఫోటో దిగిన ఫోటోతో కోహ్లీ లండన్ లో ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది.
అక్టోబర్ 19 నుంచి టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ ల కోసం కోహ్లీ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నాడు. మూడు వన్డేల సిరీస్ కు కోహ్లీ ఎంపిక కావడం ఖాయంగా మారింది. అక్టోబర్ 10 లేదా 11 న కోహ్లీ ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 36 ఏళ్ళ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ కు ఇప్పటికే తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దిగి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Virat Kohli & Anushka Sharma were spotted in London, a few days back. pic.twitter.com/7Db7G4NCN1
— Virat Kohli Fan Club (@Trend_VKohli) September 23, 2025