మార్చి 28న పాన్ ఇండియా మూవీ ది గోట్ లైఫ్‌‌‌‌ విడుదల

మార్చి 28న పాన్ ఇండియా మూవీ ది గోట్ లైఫ్‌‌‌‌ విడుదల

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్ లైఫ్‌‌‌‌’ (ఆడు జీవితం).  విజువల్ రొమాన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలవుతోంది.  మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ‘ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో ‘సలార్‌‌‌‌‌‌‌‌’తో మీ ముందుకు వచ్చా.  ఇప్పుడు ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే బానిస పాత్రతో తెరపైకి రాబోతున్నా. 

వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు. నైంటీస్‌‌‌‌లో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు అనేది చూపించాం. ఈ సినిమా కోసం 31 కిలోలు తగ్గాను.  ప్రతి ఒక్కరూ ఎమోషన్ ఫీల్ అవుతారు’ అని చెప్పాడు. ఈ మూవీ కోసం దాదాపు 150 రోజులు ఎడారిలో షూటింగ్ చేశామని దర్శకుడు బ్లెస్సీ చెప్పారు. ఈ సినిమా తెలుగులో తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అని నిర్మాత వై రవిశంకర్ అన్నారు.   హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, నిర్మాత శశి పాల్గొన్నారు.