
ఎల్బీనగర్, వెలుగు: కరెంట్ వైర్ తెగిపడి మంటలు చెలరేగి పాన్ డబ్బా దగ్ధమైన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్లో శ్రీ గణేశ్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్, పెయింట్స్ షాపు ఆవరణలో పాన్ డబ్బా ఉంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరెంట్ వైర్ తెగి కిందపడటంతో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. పాన్ డబ్బా పూర్తిగా దగ్ధమవగా.. హార్డ్వేర్ షాపు బోర్డు కాలిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఎలక్ట్రిక్ కారులో మంటలు
కంటోన్మెంట్: కానాజీగూడకు చెందిన జోనాథన్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. గురువారం రాత్రి 7 గంటలకు ఎలక్ట్రిక్ కారులో బోయిన్పల్లి పరిధిలోని డెయిరీ ఫామ్ రోడ్లో వెళ్తున్నాడు. కారులో శబ్ధం రావడంతో పక్కకు ఆపాడు. కిందకి దిగి చూడగా.. కారులో నుంచి మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం దగ్ధమైంది.