ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి
  • కేటీఆర్‌‌‌‌ టూర్‌‌‌‌ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఆఫీసర్లు

తొర్రూరు, వెలుగు : రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీ రాజ్‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు చెప్పారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా హెల్త్‌‌‌‌ స్తాఫ్‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌ డాక్టర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఫోరం, తొర్రూరు బ్రాహ్మణ అఫీషియల్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్రొఫెషనల్స్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆధ్వర్యంలో శనివారం తొర్రూరులోని ఎల్‌‌‌‌వైఆర్‌‌‌‌ గార్డెన్‌‌‌‌లో మెగా హెల్త్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ నిర్వహించారు. ఈ క్యాంప్‌‌‌‌ను మంత్రి దయాకర్‌‌‌‌రావు ప్రారంభించి మాట్లాడారు.

పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మెగా హెల్త్ క్యాంప్‌‌‌‌ నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడంలో భాగంగానే తొర్రూరులో 100 పడకలు, పాలకుర్తిలో 50 పడకల హాస్పిటల్‌‌‌‌ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరు అయ్యాయని చెప్పారు. పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. 

ఈ హాస్పిటల్‌‌‌‌ నిర్మాణం పూర్తైతే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సూపర్‌‌‌‌ స్పెషాలిటీ సేవలు అందుతాయని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌కు రుణపడి ఉండాలని, మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. 

కేటీఆర్‌‌‌‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ఈ నెల 9న తొర్రూరులో మంత్రి కేటీఆర్‌‌‌‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌‌‌‌ శశాంకతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు పరిశీలించారు. సభా స్థలంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని, నీరు, విద్యుత్‌‌‌‌ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పాలకుర్తిలో 50 పడకల హాస్పిటల్‌‌‌‌కు, కొడకండ్లలో మినీ టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ పార్క్‌‌‌‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.

 తొర్రూరులోని పాల కేంద్రం సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్​చైర్మన్‌‌‌‌ సుధాకర్‌‌‌‌రావు, ఎంపీపీ అంజయ్య, మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ రామచంద్రయ్య, పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ హరిప్రసాద్‌‌‌‌రావు, డాక్టర్‌‌‌‌ సోమేశ్వర్‌‌‌‌రావు, దేవేందర్‌‌‌‌రెడ్డి, సీతారాములు, బిందు శ్రీను, కర్నె నాగరాజు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఎర్రబెల్లి 

నెక్కొండ, వెలుగు : వరంగల్‌‌‌‌ జిల్లా నెక్కొండ మండలం నాగారం-, నక్కలగుట్టతండా, పెద్దకోర్పోల్‌‌‌‌, చిన్న కోర్పోల్‌‌‌‌ మధ్యగల వట్టె వాగుపై నిర్మిస్తున్న చెక్‌‌‌‌ డ్యామ్‌‌‌‌లు, బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులకు శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. రైతులకు పరిహారం చెక్కులు అందకుండా కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు ఆఫీసర్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌ పెద్ది స్వప్న, జడ్పీటీసీ సరోజన హరికిషన్, ఎంపీపీ రమేశ్‌‌‌‌ నాయక్‌‌‌‌, మండల అధ్యక్షుడు సూరయ్య, సొసైటీ చైర్మన్లు రాము, సంపత్‌‌‌‌రావు పాల్గొన్నారు.   

ఎంజీఎంలో  ఎంఆర్‌‌‌‌ఐ సేవలు ప్రారంభం

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్‌‌‌‌ ఎంజీఎం హాస్పిటల్‌‌‌‌లో ఎట్టకేలకు ఎంఆర్‌‌‌‌ఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.10.60 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఆర్‌‌‌‌ఐ మెషీన్‌‌‌‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌‌‌‌, ఎమ్మెల్యే నరేందర్, కలెక్టర్‌‌‌‌ ప్రావీణ్య, హాస్పిటల్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ చంద్రశేఖర్, ఆర్‌‌‌‌ఎంవోలు హరీశ్‌‌‌‌, మురళి పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఉదయమే ఎంజీఎం గేట్లు మూసివేయడంతో రోగులకు ఇబ్బందులు పడ్డారు.