జడ్పీ ఆఫీసు ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

జడ్పీ ఆఫీసు ఎదుట పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

సిద్దిపేట జిల్లా: జిల్లా పరిషత్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు పంచాయతీ కార్యదర్శులు. నంగునూరు మండలం ఎంపీడీఓ మధుసూదన్ తమను వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు కార్యదర్శలు. మధుసూదన్ వేధింపులతో పాలమాకుల పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎంపీడీవో మధుసూధన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు కార్యదర్శలు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశాల్లో.. ఛాంబర్ లో కలసినప్పుడు తమను కించపరిచేలా, అమర్యాదగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఎంతో అనుభవం ఉన్న ఉద్యోగులను కూడా చిన్నపిల్లల్లా ట్రీట్ చేస్తూ.. బానిసల్లా చూస్తున్నారని ఆరోపించారు. ఎంతో శ్రమకోర్చి పనిచేసినా.. ఏ మాత్రం ప్రశింసించకపోగా తిట్ల దండకం అందుకోవడం సాధారణంగా మారిందన్నారు. పెద్దపెద్ద పనులు అప్పగించి రాత్రిలోపు పూర్తి చేయాలి.. చేస్తారా.. చస్తారా..? అనే రీతిలో వేధిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, వేధింపుల నుంచి తమను రక్షించాలని డిమాండ్ చేశారు. 

 

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్కు టీఆర్ఎస్ మంత్రులు, నేతల నివాళి

ఆకట్టుకునేలా కోస్ట్ గార్డ్‌ క్యాడెట్ల కవాతు

బౌలర్ కు చుక్కలు..ఒకే ఓవర్లో ఐదు సిక్సులు,ఒక ఫోర్

NBK107 మాస్ పోస్టర్ రిలీజ్