
హైదరాబాద్, వెలుగు : ఉద్యోగుల విభజన, జోనల్ కేటాయింపుల్లో వేలాది మంది పంచాయతీ సెక్రటరీలకు అన్యాయం జరిగిందని పంచాయతీ సెక్రటరీస్అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో న్యాయం చేయాలని గవర్నర్ తమిళిసైని కోరారు. రాజ్ భవన్ బయట ఇటీవల ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌లో బుధవారం అసోసియేషన్ నేతలు లెటర్ వేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ కు, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్‌లకు మెమోరాండం ఇచ్చారు. ఒక జోన్ నుంచి మరో జోన్ కు కార్యదర్శులను ట్రాన్స్ ఫర్ చేశారని, స్పౌజ్ విషయంలో న్యాయం చేయాలని అప్పీల్ చేశామన్నారు. గద్వాలలో పనిచేస్తున్న కార్యదర్శిని బాసరకు, ఆదిలాబాద్ లో పనిచేస్తున్న కార్యదర్శిని కొత్తగూడేనికి ట్రాన్స్ఫర్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.