V6 News

హైదరాబాద్లో పరిస్థితి ఏంటి..? పెట్రోల్, డీజిల్ దొరుకుతుందా..? లేదా..?

హైదరాబాద్లో పరిస్థితి ఏంటి..? పెట్రోల్, డీజిల్ దొరుకుతుందా..? లేదా..?

హైదరాబాద్: హైదరాబాద్ వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంక్లలో పెట్రోల్, డీజిల్ కొరత స్పష్టంగా కనిపించింది. పానిక్ బయ్యింగ్ కారణం గానే కొరత ఏర్పాటుందని బంక్ నిర్వాహకులు చెప్పారు. హైదరాబాద్ ప్రైవేట్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్, ప్రభుత్వ బంక్ల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపించాయి. 

వందలాది బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండే సరికి వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంధన కొరతతో వాహనదారుల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. డబ్బులు కట్టినా కంపెనీలు ట్యాంకర్లను పంపకపోవడం కూడా పెట్రోల్, డీజిల్ కొరతకు కారణం.

హైదరాబాద్లోని బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 2 లీటర్లే పోస్తామంటూ బోర్డులు పెట్టారు. అధిక కొనుగోళ్లతో జిల్లాల్లోనూ పరిస్థితి ఆగమాగంగా ఉంది. బైక్లకు రూ.500, కార్లకు 2వేల చొప్పున పెట్రోల్ బంకులు కోటా పెడుతున్న పరిస్థితి ఉంది. ఇది తాత్కాలిక ఒత్తిడేనని, ఇంధన కొరత లేదని అధికారులు, ప్రభుత్వం చెబుతుంది. ఇంధనాన్ని దాచి పెట్టి కృత్రిమ కొరత సృష్టించినా, తప్పుడు వదంతులు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 హైదరాబాద్​ సిటీలో ఆదివారం సాయంత్రం నుంచే వాహనదారుల పెట్రోల్​ బంకులకు క్యూలు కట్టారు. సోమవారానికి ఈ పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది.చాలా బంకుల్లో పెట్రోల్​స్టాక్​ లేదంటూ బోర్డులు దర్శనం ఇచ్చాయి. 

ఉన్న బంకుల్లో చాలా మంది అవసరానికి మించి పెట్రోల్ కొన్నారు. బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​, సికింద్రాబాద్​, దిల్​సుఖ్​​నగర్​, అంబర్​పేట, కూకట్​పల్లి, మాదాపూర్​, నాంపల్లి, లక్డీకాపూల్​ వంటి ప్రాంతాల్లోని పెట్రోల్​ బంకుల ఎదుట వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. 

ఫోర్ వీలర్స్​, టూ వీలర్లు, ఆటోల క్యూలు పెరిగిపోవడంతో చాలాచోట్ల ట్రాఫిక్​జామ్స్ ఏర్పడింది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలో లైన్లు కట్టగా, సాయంత్రం అక్కడక్కడా వర్షం పడడంతో వానలో తడుస్తూ క్యూలో ఉండాల్సి వచ్చింది.