25వ వరల్డ్‌‌ టైటిల్‌‌ ఖాతాలో వేసుకున్న పంకజ్‌‌ అద్వానీ

25వ వరల్డ్‌‌ టైటిల్‌‌ ఖాతాలో వేసుకున్న పంకజ్‌‌ అద్వానీ

కౌలాలంపూర్‌‌‌‌: ఇండియా స్టార్‌‌ క్యూయిస్ట్‌‌ పంకజ్‌‌ అద్వానీ 25వ వరల్డ్‌‌ టైటిల్‌‌ ఖాతాలో వేసుకున్నాడు. శనివారం జరిగిన వరల్డ్‌‌ బిలియర్డ్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్లో పంకజ్‌‌ 4–0తో తోటి ఆటగాడు సౌరవ్‌‌ కోఠారిని చిత్తు చేసి విజేతగా నిలిచాడు. 150– అప్‌‌ ఫార్మాట్‌‌లో జరిగిన ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడు కనబరిచాడు. కెరీర్‌‌లో తొలి వరల్డ్‌‌ టైటిల్‌‌ వేటలో ఉన్న సౌరవ్‌‌కు  ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నాలుగు ఫ్రేమ్స్‌‌లోనూ ఆధిక్యం చూపెట్టాడు. దాంతో, ఒక క్యాలెండర్‌‌ ఇయర్‌‌లో నేషనల్‌‌, ఏషియన్‌‌, వరల్డ్‌‌ టైటిళ్లను పంకజ్​ ఐదేసి సార్లు గెలిచాడు. 

హర్షదాకు బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌

మనామ: ఇండియా  యంగ్‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌ హర్షదా గరుడ్‌‌‌‌ ఆసియా వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌తో మెరిసింది. జూని యర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌  చాంపియన్‌‌‌‌ అయిన 18 ఏండ్ల హర్షదా శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌ 45 కేజీ ఈవెంట్‌‌‌‌లో మొత్తం 152 కేజీల (స్నాచ్‌‌‌‌ 68+క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌ 84) బరువెత్తి మూడో స్థానంతో  ఈపతకం సాధించింది. ఇది  నాన్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కేటగిరీ కావడంతో స్నాచ్‌‌‌‌లో 68 కేజీలకు గాను మరో బ్రాంజ్‌‌‌‌ సొంతం చేసుకుంది.