కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని రివ్యూస్ వచ్చాయ్: ‘పరదా’ సినిమా రెస్పాన్స్పై అనుపమ

కెరీర్  బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని రివ్యూస్ వచ్చాయ్: ‘పరదా’ సినిమా రెస్పాన్స్పై అనుపమ

‘పరదా’ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదలైంది. ఈ చిత్రానికొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు సోమవారం ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించింది టీమ్. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ‘తెలుగు సినిమాలో ఇదొక  డేరింగ్ స్టెప్.  ఇలాంటి సినిమాని చేసినందుకు గర్వపడుతున్నా. నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇది మోస్ట్ ఫేవరెట్ ఫిలిం. కెరీర్  బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని రివ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది.

ఆడియెన్స్ నుంచి వస్తోన్న స్పందన ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా విషయంలో నేను ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాను’ అని చెప్పింది. ఈ సినిమాకి నేషనల్ వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చాలా మంచి రివ్యూస్ వచ్చాయని, అయితే కొన్ని తప్పులు గురించి కూడా రాశారని వాటిని తాను యాక్సెప్ట్ చేస్తానని డైరెక్టర్ ప్రవీణ్ చెప్పాడు. నిర్మాత  విజయ్, నటుడు  రాగ్ మయూర్,  ఎడిటర్ ధర్మేంద్ర పాల్గొన్నారు.