
సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటించిన హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల నలభై సెకన్స్ ఉన్న ఈ ట్రైలర్‌లో కేరళ అమ్మాయి సుందరిగా జాన్వీకపూర్, ఢిల్లీకి చెందిన పరమ్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించారు. భాష, సంస్కృతులు, ఆచార వ్యవహారాల్లో భిన్న వ్యత్యాసాలు ఉన్న వీరిమధ్య చిగురించిన ప్రేమ చివరకు ఎలా గమ్యాన్ని చేరుకుంది అనేది మెయిన్ కాన్సెప్ట్.
లవ్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌లో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా సాగింది. సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.