- ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు పరశురామ్
హైదరాబాద్, వెలుగు : కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముదించాలని కోరుతూ మార్చి 12న ఢిల్లీపై దండోరా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నివాసంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంకు ఏర్పాటుకు అంబేద్కరే కారణమన్నారు. ఆర్బీఐ ఏర్పడి 90 ఏండ్లయినా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించకపోవడం చరిత్రను వక్రీకరించడమేనని స్పష్టం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
