పార్​ బాయిల్డ్​ బియ్యం ఎంతో బలం

V6 Velugu Posted on Sep 28, 2021

ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వాడే పార్​ బాయిల్డ్​ బియ్యం ఇప్పుడు మన దగ్గర కూడా పండిస్తున్నారు చాలామంది రైతులు. ఆ బియ్యంతో  ఆరోగ్యం సొంతం అవుతుందని అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 
బియ్యం ఎన్నో రకాలు వాటిలో పార్​ బాయిల్డ్​ బియ్యం ఒకటి.  పార్​ బాయిల్డ్​ అంటే ఉడికించిన బియ్యం. వండడానికి ముందే స్టీమ్​ చేసి ఆరబెట్టినవి.  వీటిని ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ వాడతారు.  బియ్యం నానబెట్టి, స్టీమ్​ చేసి, మళ్లీ ఆరబెడతారు. దీంతో తేమ పోయి పోషకాలు పెరుగుతాయి. దానివల్ల బియ్యం కాస్త రంగు కూడా మారుతుంది.  ఇది  తెల్ల అన్నం కంటే మెత్తగా ఉంటుంది. కానీ ఎక్కువ అంటుకోదు. పార్​ బాయిల్డ్ రైస్ హెల్త్​కు కూడా ఎంతో ఉపయోగం. రెగ్యులర్​  బియ్యంతో పోలిస్తే పార్​బాయిల్డ్​ అన్నంలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్ , ప్రొటీన్లు ఉంటాయి.  అర కిలో పార్​ బాయిల్డ్​ బియ్యంలో 776 కేలరీల శక్తి ఉంటుంది. 2 గ్రాముల ఫ్యాట్​, 164 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల​ ఫైబర్​, 20 గ్రాములు ప్రొటీన్లు ఉంటాయి. పార్​ బాయిల్డ్ రైస్‌‌లోని పిండి పదార్థాలు ఒక ప్రిబయోటిక్‌‌గా పనిచేస్తాయి. పేగుల్లో హెల్దీ బ్యాక్టీరియాను పెంచుతాయి. అలాగే డైజెస్టింగ్​ సిస్టమ్​లో సూక్ష్మజీవులను బ్యాలెన్స్​ చేస్తుంది ఈ బియ్యం. ఫిజికల్​ హెల్త్​ నుంచి మెంటల్​ హెల్త్​ వరకు ఈ బియ్యం ప్రభావాన్ని చూపుతుంది. డయాబెటిస్​ సమస్యలకు తెలుపు బియ్యం, బ్రౌన్​ రైస్​ రెండిటితో పోలిస్తే, పార్​బాయిల్డ్​ రైస్ రక్తంలో షుగర్​ లెవల్స్​పై తక్కువ  ఎఫెక్ట్​  చూపిస్తాయి. షుగర్​ ఉన్న వాళ్లకి ఈ  రైస్ మంచిదంటున్నారు. ఈ బియ్యాన్ని తక్కువ టెంపరేచర్​లో ఉంచినా లేదా వండిన అన్నాన్ని ఫ్రిజ్​లో పెట్టి తర్వాత తిన్నా బాగుంటుంది. పైగా షుగర్​ లెవల్స్​ని ఈ చల్లన్నం తగ్గిస్తుంది. 

Tagged health, life style, strong, rice, , Parboiled

Latest Videos

Subscribe Now

More News