కొడుకు పుట్టలేదని కూతురును ఐసీడీఎస్ కు పంపిన్రు

కొడుకు పుట్టలేదని కూతురును ఐసీడీఎస్ కు పంపిన్రు
  • మరిపెడ మండలంలో ఘటన  
  • వరంగల్​ శిశుగృహకు తరలించిన అధికారులు

మరిపెడ, వెలుగు : కొడుకు కావాలనుకున్న మహబూబాబాద్​ జిల్లా మరిపెడ మండలం రెడ్యా నాయక్ తండాకు చెందిన భార్యభర్తలకు మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టారు. తనకు మనవడు కావాలని భర్త తల్లి పట్టుబట్టడంతో మూడో కాన్పుకు సిద్ధమయ్యారు. మళ్లీ అమ్మాయే పుట్టడంతో  పెంచడం తమవల్ల కాదని అధికారులకు అప్పజెప్పారు. ఇక్కడితో ఆగకుండా నాలుగోసారి కొడుకు కోసం చూడగా ఈసారీ ఆడపిల్లే పుట్టింది. దీంతో తమకు సాదే స్థోమత లేదని మంగళవారం చైల్డ్​లైన్​కు ఫోన్​చేసి అధికారులకు అప్పగించారు. చిన్నారిని తీసుకువెళ్లడానికి రెడ్యానాయక్​ తండాకు వచ్చిన మరిపెడ ఐసీడీఎస్ ​ప్రాజెక్ట్ సీడీపీఓ శిరీష మాట్లాడుతూ పాపను వరంగల్ శిశుగృహకు తరలించామని, గతంలో కూడా ఆడపిల్ల పుట్టగా ఇలాగే చేశారన్నారు. నార్మల్ డెలివరీలు అవుతుండడంతో కొడుకు కోసం వరుస ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గతంలోనే కౌన్సిలింగ్ ఇచ్చామని, అయినా..వారసత్వం కోసం తల్లి అడడగడంతో బిడ్డలను కంటున్నారన్నారు. తండాలో అవగాహన కల్పిస్తామన్నారు.