
‘మసూద’తో హిట్ అందుకున్న తిరువీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పరేషాన్’. పావని హీరోయిన్. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకుడు. రానా దగ్గుబాటి సమర్పణలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘ధావత్ ఇన్ థియేటర్స్’ అంటూ శుక్రవారం మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 2న విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణలోని ఓ పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో సాగే హిలేరియస్ ఎంటర్‌టైనర్. బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నాడు.