
- పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శ
హైదరాబాద్, వెలుగు: చేపల పులుసు కో సం తెలంగాణ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టిన పాపాత్ములు కేసీఆర్, హరీశ్ అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సీఎల్పీలో మీడి యాతో మాట్లాడారు. ప్రజా భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి...కేసీఆర్, హరీశ్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేశారని ఆరోపించారు.
ఈ ఇద్దరు నేతలు తెలంగాణకు చేసిన జల ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలకు రేవంత్ కళ్లకు కట్టేలా వివరించారని తెలిపారు. రాయలసీమను రతనాల సీమ చేయడానికి కేసీఆర్, హరీశ్ చేసిన కుట్రలను రేవంత్ బయటపెట్టడంతో తెలంగాణ ప్రజలకు మామ, అల్లుడు అడ్డంగా దొరికిపోయారని ఆరోపణలు చేశారు.