పరీక్షా పే చర్చ విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది : లక్ష్మణ్

పరీక్షా పే చర్చ  విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది : లక్ష్మణ్

పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ అనుభవాలు పంచుకోవడంతో పాటు ఒత్తిడి తగ్గించే చిట్కాలు తెలుసుకుంటున్నారని అన్నారు. ఆరో విడత పరీక్షా పే చర్చలో భాగంగా కర్మన్ ఘాట్​లోని దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ వారియర్స్ ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్.. ప్రధాని మోడీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయని చెప్పారు. మోడీ తన సొంత అనుభవాల ఆధారంగా పరీక్షలు సహా జీవితం గురించి ఎన్నో విషయాలను వివరించారని అన్నారు. పరీక్షా పే చర్చలో భాగంగా జనవరి 27న మోడీ మరోసారి విద్యార్థులతో ఇంటరాక్ట్ కానున్నారు.