నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో తెలుగు వ్యక్తికి చోటు

నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో తెలుగు వ్యక్తికి చోటు
అమెరికాలోని నోబెల్‌ సైంటిస్టుల క్లబ్‌లో తెలుగు వ్యక్తికి స్థానం లభించింది. 1981-83లో SVUలో ఫిజికల్‌ ఆంత్రోపాలజీ అండ్‌ ప్రి-హిస్టారిక్‌ ఆర్కియాలజీలో MSC పూర్తి చేసిన తిరుపతి రూరల్‌ బల్లంగుంటకు చెందిన పార్లపల్లె హేమచంద్రారెడ్డి ఈ ఘటత సాధించారు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌మెంట్‌ సైన్సెస్‌(AAAS)లో ఫెలోగా నియమితులయ్యారు. నోబెల్‌ అవార్డు అందుకున్న,అందుకోనున్న శాస్త్రవేత్తలు ఈ సంస్థలో ఉంటారు. వృద్ధాప్యంలో మతిమరుపు ఎలా వస్తుందనే అంశంపై హేమచంద్రారెడ్డి విస్తృతంగా పరిశోధనలు జరిపారు. దీంతో ఆయనను నోబెల్‌ శాస్త్రవేత్తల క్లబ్‌లో ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు.