పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడి అరెస్ట్

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడి అరెస్ట్

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మహేష్ కుమావత్ ను శనివారం (డిసెంబర్16) న  ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరో నిందితుడు మహేస్ కుమావత్.  ప్రధాన సూత్రధారి లలిత్ ఝా, ఇతర నిందితులు పన్నిన కుట్రలో భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటివరకు లలిత్ ఝా, మహేష్, నీలం, సాగర్ శర్మ, మనోరంజన్ , అమోల్షిండే  అనే ఆరుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పట్టుబడిన నిందితుడు మహేష్ కుమావత్ ను ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరపర్చనున్నారు. . 

డిసెంబర్ 13న ఇద్దరు నిందితులు లోక్ సభ లోపలికి చొరబడి  స్మోక్ బాంబ్ లు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాస్టర్ మైండ్ లలిత్ ఝా తో సహా ఐదుగురురికి ఇప్పటికే అరెస్ట్ చేసి చేశారు. తాజా మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు.. 2001లో పార్లమెంట్ పై దాడి జరిగిన రోజునే లోక్ సభలో స్మోక్ బాంబ్ లతో యువకుడు గందరగోళం సృష్టంచడంతో పార్లమెంట్ సెక్యూరీటి భద్రతా లోపంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో నిందితుల రిమండ్ రిపోర్టులో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టారు. దేశంలో అరాచకం సృష్టించాలని, తద్వారా తమ డిమాండ్లను సాధించుకునేందుకు ప్రభుత్వం వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రధాన నిందితుడు లలిత్ ఝాకు ఏదైన శత్రు దేశంనుంచి లేదా ఉగ్రవాత సంస్థతో సంబంధాలు ఉన్నాయా.. విదేశీ నిధులతో సంబంధం ఉందా  అనే కోణంలో విచారిస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read:-ఏంటీ కన్ఫ్యూజన్ బిగ్ బాస్.. ఇంతకీ విన్నర్ ఎవరూ?