ఏంటీ కన్ఫ్యూజన్ బిగ్ బాస్.. ఇంతకీ విన్నర్ ఎవరూ?

ఏంటీ కన్ఫ్యూజన్ బిగ్ బాస్.. ఇంతకీ విన్నర్ ఎవరూ?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) విన్నర్ శివాజీ(Shivaji).. కాదు కాదు పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) విన్నర్.. వాళ్లిదరు కాదు అమర్ దీప్(Amardeep) విన్నర్. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ విన్నర్ గురించే చర్చ నడుస్తోంది. మా ఫెవరేట్ కంటెస్టెంట్ విన్నర్ అంటే.. మా ఫెవరేట్ కంటెస్టెంట్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. 

నిజానికి బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ జరగనంత ఉత్కంఠగా సీజన్ 7 సాగుతోంది. ఈ సీజన్ కు ఉల్టా పుల్టా అని ఏ ముహూర్తాన పెట్టారో గానీ.. సీజన్ మొత్తం అలాగే సాగింది. చివరకి విన్నర్ విషయంలో కూడా అదే జరిగేలా ఉంది. ఈ సీజన్ లో కేవలం ముగ్గురి మధ్యనే టఫ్ ఫైట్ జరిగింది. శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్. ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ కానున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ పరంగా కూడా ఈ ముగ్గురిలోనే టఫ్ ఫైట్ జరిగింది. ఇక గ్రాడ్ ఫినాలే డిసెంబర్ 17న జరుగనున్న నేపధ్యంలో శుక్రవారం నాటికి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. 

ఓటింగ్ కూడా ముగియడంతో.. విన్నర్ ఎవరో తేలిపోయింది అంటూ కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. అందులో కొంతమంది శివాజీ విన్నర్ అని చెప్తుంటే మరికొన్నేమో పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్తున్నాయి. ఇంకొందరేమో అమర్ దీప్ కూడా టైటిల్ రేస్ లో ఉన్నట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఆడియన్స్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ అసలు విన్నర్ ఎవరు బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని, అందుకే ఫైనల్ జెడ్జిమెంట్ వచ్చే వరకు విన్నర్ గురించి చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Also Read:-గేమ్ ఛేంజర్ చివరి షెడ్యూల్స్తో బిజీ..అప్డేట్స్ రాక ఫ్యాన్స్ గజిబిజి