గేమ్ ఛేంజర్ చివరి షెడ్యూల్స్తో బిజీ..అప్డేట్స్ రాక ఫ్యాన్స్ గజిబిజి

 గేమ్ ఛేంజర్ చివరి షెడ్యూల్స్తో బిజీ..అప్డేట్స్ రాక ఫ్యాన్స్ గజిబిజి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్ లో వస్తన్న మోస్ట్ వాంటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ (Game changer). భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్ని అంచనాలున్నాయో..అన్నిఆశలు కూడా ఉన్నాయి. ఈ మూవీ మొదలై సంవత్సరాలు గడుస్తోన్న..సరైన అప్డేట్ ఒకటంటూ లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా శివాలెత్తుతున్నారు.

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఒక సమాచారం వినిపిస్తోంది. రీసెంట్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా..మరో కొత్త షెడ్యూల్ ఈ నెల 26 నుంచి 30 వరకు జరగనున్నట్లు సమాచారం. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో గేమ్ ఛేంజర్ అప్డేట్స్ మొదలవ్వబోతుందని టాక్. కానీ,అంతకుముందే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి..జరగండి పాట రాబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  

 గేమ్‌ ఛేంజర్‌ సినిమాని..ఎన్నో సూప‌ర్ డూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను రూపొందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కనిపిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు తమన్  (Thaman) సంగీతం అందిస్తున్నారు.