బెంగాల్ లో ఎలక్షన్లకోసమే ..వందేమాతరం లొల్లి:ప్రియాంకగాంధీ

 బెంగాల్ లో ఎలక్షన్లకోసమే ..వందేమాతరం లొల్లి:ప్రియాంకగాంధీ

మోదీ ఎన్నికల కోసం పనిచేస్తారు కానీ.. దేశం కోసం పనిచేయరా అని ప్రియాంకగాంధీ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు, SIR పై చర్చను తప్పించుకునేందుకు వందేమాతరం చర్చకు తెచ్చారన్నారు. వందేమాతరాన్ని  విభజించడం అంటే  స్వాతంత్య్రాన్ని అవమానించడమే  అన్నారు ప్రియాంకగాంధీ. 

లోక్ సభలో  వందేమాతరం  పై చర్చలో మాట్లాడిన ప్రియాంకగాంధీ.. ప్రజా సమస్యలకోసం చర్చిద్దామంటే ప్రభుత్వం ఎందుకు డైవర్ట్ చేస్తుందని ప్రశ్నించారు. మేం ప్రజాప్రతినిధులం.. కళాకారుల కాదు.. మేం దేశంకోసం, ప్రజలకోసం పనిచేస్తుంటే.. మీరు ఎన్నికలకోసం , అధికారం కోసం పనిచేస్తున్నారని మోదీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. 

మొదటి సారి కాంగ్రెస్ సమావేశంలో వందేమాతరం పాడినప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యం వణికిపోయిందన్నారు. సత్యం, అహింసా మార్గంలో వందేమాతర ఉద్యమం సాగిందన్నారు. వంతేమాతరంపై నేతాజీకి నెహ్రూ లేఖ రాసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. నెహ్రై లేఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బెంగాల్ ఎన్నికలు ఉన్నాయనే వందేమాతరంపై చర్చకు పెట్టారన్నారని  ప్రియాంకాగాంధీ వివరిస్తుంటే సభ చప్పట్లతో మార్మోగింది. 

►ALSO READ | ఇండిగో సంక్షోభం: 2 వారాల్లో 827 కోట్ల టిక్కెట్ల డబ్బు వాపస్.. సగం సామాను అప్పగింత..

నెహ్రూ తెచ్చిన  ఇస్రో లేకుంటే మంగళ్ యాన్ లేదన్నారు ప్రియాంకగాంధీ. మీరు అమ్ముకుంటున్న కేంద్ర సంస్థలన్నీ జవహర్ లాల్ నెహ్రూ తెచ్చినవే అని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశం ఈ స్థాయిలో ఉందంటే నెహ్రూ తెచ్చిన  సంస్కరణలే కారణమన్నారామె. 

మరోవైపు మోదీ సర్కార్ పై ఓ రేంజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంకగాంధీ. మోదీ సర్కార్ తెచ్చిన సంస్కరణలన్నీ ఫెయిల్ అయ్యాయని విమర్శించారు.