భర్తపై స్వతంత్ర్య అభ్యర్థిగా పోటికి దిగిన భార్య

భర్తపై స్వతంత్ర్య అభ్యర్థిగా పోటికి దిగిన భార్య

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే .  ఏ రిలేషన్ అయినా కుటుంబంలో కానీ బయట కాదు. వ్యాపారాల్లో అయినా..వృత్తిలో అయినా రిలేషన్స్ షిప్ ను పక్కన పెడతారు. రాజకీయాల్లో రిలేషన్స్ ను అస్సలు లెక్కచేయరు. ఈ విషయం అవునని నిరూపించారు ఓ భార్యభర్తలు. ఒకే నియోజకవర్గం నుంచి  పోటీకి దిగి చర్చనీయాంశంగా మారారు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పార్థసారథి వైసీపీ తరపున పోటీకి దిగగా.. ఆయన భార్య కమల ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈ విషయం చెప్పారు. పార్థసారథికి ఫ్యాన్ గుర్తు కేటాయించగా..కమలకు బెల్టు గుర్తు కేటాయించారు. పెనమలూరులో 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా టీడీపీ నుంచి బోడెప్రసాద్, వైసీపీనుంచి పార్థసారథి, బీఎస్పీ నుంచి లంకా కమలాకర్ రాజు పోటీలో ఉన్నారు.